VM Today News - వార్తలు / పల్నాడు : ఏ ఎమ్ రెడ్డి విద్యాసంస్థల ప్రెసిడెంట్ కన్నుమూత స్థానిక పెట్లూరి వారి పాలెం నందుగల ఏఎం రెడ్డి విద్యాసంస్థల ప్రెసిడెంట్ గున్నం చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూసినట్లుగా విద్యాసంస్థల సెక్రటరీ శ్రీమతి అట్లూరి శాంతి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తమ విద్యా సంస్థల ప్రెసిడెంట్ మృతిపై విద్యాసంస్థల చైర్మన్ అట్లూరి శ్రీనివాసరెడ్డి , ప్రిన్సిపల్స్, బోధన మరియు బోధనేతర సిబ్బంది తమ సంతాపాన్ని తెలియజేశారు. చంద్రశేఖర్ రెడ్డి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అట్లూరి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.
Admin
VMToday News