VM Today News - వార్తలు / పల్నాడు : చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని క్రోసూరు మండలం వైద్యాధికారి మహమ్మద్ సాద్ తెలిపారు శుక్రవారం పలనాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి మూడు, నాలుగు, ఐదవ తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై ప్రదర్శన, మానవహారం నిర్వహించారు ఈ ప్రదర్శన మెయిన్ ప్రాథమిక పాఠశాల నుండి గ్రామ సచివాలయాల కార్యాలయాల వరకు సాగింది ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రదర్శనలో పోలియో రహిత సమాజం మన ధ్యేయం, నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో చుక్కలు వేయించు అక్క అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారి మహమ్మద్ సార్ మాట్లాడుతూ 0 నుండి ఐదు సంవత్సరముల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ గ్రామ సర్పంచ్ ముక్కు అంజలి గోపి, గ్రామ కార్యదర్శి వెంకయ్య, ప్రధానోపాధ్యాయిని పాపులమ్మ, ఉపాధ్యాయులు ముసలారెడ్డి సయ్యద్ హసన్ సి హెచ్ ఓ లు భూలక్ష్మి ధనరేఖ, ఆరోగ్య కార్యకర్తలు కోటేశ్వరమ్మ అనుపమ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News