VM Today News - వార్తలు / పల్నాడు : మార్చి మూడో తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని క్రోసూరు మండల స్థాయి అన్ని శాఖల అధికారులు జయప్రదం చేయాలని క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డివిఎస్ రమాదేవి పేర్కొన్నారు గురువారం పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు ఎంపీడీవో కార్యాలయం లోని ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన పల్స్ పోలియో మండల టాస్క్ ఫోర్స్ సమావేశమునకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు మండలంలో మొత్తం 25 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసినట్లు ముగ్గురు రూట్ ఆఫీసర్లను నియమించినట్లు సంచార టీములను రెండు నియమించినట్లు ఆమె తెలిపారు మొత్తం జీరో టు ఐదు సంవత్సరాలు లోపు 4719 మంది పిల్లలకు వేయటానికి ప్రణాళిక రూపొందించినట్లు ఆమె తెలిపారు సంచార జాతులు ఇటుక బట్టీలు కట్టడాలు నిర్మాణ స్థలాల్లో పనిచేసే వారికి వేరే ప్రాంతం నుండి క్రోసూరు మండలానికి మిరపకోతలకు వచ్చిన వ్యవసాయ కూలీల పిల్లలకు మొబైల్ టీం ద్వారా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరముల లోపు పిల్లలందరికీ మార్చి మూడో తేదీన ఆదివారం రోజు కూలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు మిగతా రెండు రోజులు అనగా మార్చి 4వ తేదీ మార్చి 5వ తేదీన ఇంటింటి పల్స్ పోలియో కార్యక్రమం లో పోలియో చుక్కలు వేయించుకొని మిగిలిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారన్నారు క్రోసూరు లోని అమరావతి బస్టాండ్ సెంటర్లో పోలియో చుక్కల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగినదని ప్రయాణంలో ఉన్న కూడా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు కావున మండలంలోని పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, ఐసిడిఎస్, విద్యాశాఖ, విద్యుత్ శాఖ ఆర్టీసీ శాఖ వారు తమ యొక్క సహకారాన్ని వైద్యశాఖ కు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి శివన్నారాయణ వైద్య ఆరోగ్యశాఖ సూపర్వైజర్ శివుడు విద్యుత్ శాఖ ఎం వి సుబ్బారెడ్డి విద్యాశాఖ అబ్దుల్ సత్తార్ ఐసిడిఎస్ నుండి మెరీనా తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News