VM Today News - వార్తలు / పల్నాడు : ఐదుగురికి భారతరత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం పట్ల శ్యామ్ మిత్రమండలి గౌరవ అధ్యక్షులు శిఖా శాంసన్ ఆదివారం అవార్డు గ్రహీతలకు హర్షం అభినందనలు తెలిపారు సంస్కరణ రూప శిల్పి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు, ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి కి కృషిచేసిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కి, కర్షకపక్షపాతిగా ఎనలేని సేవలు అందించిన ఐదో మాజీ ప్రధాని చరణ్ సింగ్ లకు , లాల్ కృష్ణ అద్వానీ తో పాటు వెనకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరి రాకూరికి భారతరత్న అవార్డులు ప్రకటించటం పట్ల ఆయన అభినందనలు తెలియజేశారు ప్రపంచంలోనే అత్యంత అప్పులన్న మూడో దేశంగా నిలిచిన భారత్ ను ఆదుకునేందుకు ఆనాటి సమయంలో ప్రధాని అయిన పీవీ నరసింహారావు నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ ను తోడుగా చేసుకొని సంస్కరణలను పరుగులు పెట్టించారన్నారు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటిన మహనీయుడు స్వర్గీయ పీవీ నరసింహారావు బహు భాషా కోవిదులు అని గొప్ప ఆధ్యాత్మికవేత్తని వివాద రహితుడని గొప్ప పరిపాలన దక్షుడని తెలుగు ప్రజలతో పాటు పీవీ నరసింహారావు దేశ ప్రజల మన్ననలు పొందారన్నారు మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు పివి ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేసిన గొప్ప మహనీయుడు పివి. రైతే దేశానికి వెన్నెముకని చరణ్ సింగ్ బలంగా నమ్మారు అందుకే తాను ఏ పదవిలో ఉన్న అన్నదాతల పక్షాన నిలబడ్డారు వారి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేశాడు రైతు నాయకుడిగా దేశ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకున్నారు. దేశ వ్యవసాయ రంగ ఆధునీకరణలో స్వామినాథన్ చెరగని ముద్ర వేశారు ప్రజలు పస్తులు ఉండే దుస్థితి పోవాలని ఆయన పరితపించారు అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలను సృష్టించారు ఇసుక నేలల్లోనూ పసిడి రాశులు పండించొచ్చని నిరూపించారు స్వామినాథన్ దేశం ఆకలి తీర్చిన గొప్ప శాస్త్రవేత్త స్వామినాథన్ రామన్ మెగసెసే ఇందిరా గాంధీ శాంతి బహుమతి సహా అనేక పురస్కారాలను అందుకున్నారని శాంసన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు
Admin
VMToday News