VM Today News - వార్తలు / పల్నాడు : అనంతవరంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం సచివాలయం ఆవరణలో శుక్రవారం ఆరోగ్య సురక్ష క్యాంపు ప్రారంభించారు పంచాయతీ కార్యదర్శి షాహిదా పర్యవేక్షణలో జగనన్న సురక్ష క్యాంపును నిర్వహించారు అనంతవరం సచివాలయ పరిధిలోని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో సర్వే ద్వారా గుర్తించిన వ్యాధిగ్రస్తులు హాజరయ్యారు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ ఎం. రాజేష్ డాక్టర్ సిరి చందనలు పీజీ డాక్టర్లు తదితర వైద్య బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు క్యాంపుకు పది రోజులు ముందే సంబంధిత ఏఎన్ఎం పద్మ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఇంటింటి సర్వే ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించారు క్యాంపుకు 169 మంది హాజరైనట్లు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ తెలిపారు క్యాంపులో రోగుల నమోదు కేంద్రం బీపీ షుగర్ వంటి వాటికి వైద్య పరీక్ష కేంద్రం మందులు పంపిణీ కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు రోగులకు అవసరమైన త్రాగునీటి వసతి కల్పించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ గోగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి , సిహెచ్ అనంతలక్ష్మి మండల మహిళా సమైక్య వారు మాట్లాడుతూ పేద రోగుల ముంగిట్లోకి వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సచివాలయాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కూచిపూడి ప్రభావతి, ఫార్మసిస్ట్ ఫాతిమా , ఆరోగ్య కార్యకర్తలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఆశా కార్యకర్తలు సచివాలయ సిబ్బంది సేవలు అందించారు
Admin
VMToday News