VM Today News - వార్తలు / పల్నాడు : శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారికి విశేష అలంకరణ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటరమణచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. సత్తెనపల్లి: స్థానిక పట్టణంలో 22వ వార్డు నాగన్నకుంట వేంచేసి ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వైశాక మాసం సందర్భంగా స్వామివారికి మల్లెపూలతో అలంకరణ మరియు మల్లెపూలతో పూజ జరిగినది. ప్రత్యేకంగా మహిళలచే అయ్యప్ప కోలాట బృందం వారిచే కోలాట సేవ జరిగినది. అనుమాల రమాదేవి ఆధ్వర్యంలో కోలాటం చేశారు. ఈ కోలాట సేవలో 45 మహిళలు మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించినవారు జిల్లా వెంకట సుబ్బారావు ప్రశాంతి దంపతులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు, స్వామివారి సేవకులు తదితరులు పాల్గొన్నారు..
Reporter
VMToday News