VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో పల్స్ పోలియో అమలు తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ బృంద సభ్యులు డాక్టర్ కోటేశ్వరరావు బుధవారం పరిశీలించారు క్రోసూరు లోని ఎస్సీ కాలనీలోని ఇళ్లను సందర్శించారు ఐదేళ్ల లోపు పిల్లలకు చుక్కలు వేశారా? లేదా? పరిశీలించారు రెండు, మూడో రోజు ఇళ్లను ఆరోగ్య సిబ్బంది సందర్శిస్తున్నారా లేదా అని ఆరా తీశారు గృహాలపై మార్కింగ్ వేస్తున్నారా లేదా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు పోలియో చుక్కలు వేసిన చిన్నారుల ఎడమ చేతి చిటికెన వేలికి జంక్షన్ వైలెట్ మార్కింగ్ ఉందా లేదా పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, హెల్త్ సూపర్వైజర్లు శివుడు ప్రభావతి ఆరోగ్య కార్యకర్త లావణ్య ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News