VM Today News - వార్తలు / పల్నాడు : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను పారద్రోల వచ్చునని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు సోమవారం ఆయన మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ బేగ్ తో కలిసి క్రోసూరు మండలం గుడిపాడు గాదే వారి పాలెం గరికపాడు గ్రామాల్లో జరుగుతున్న యాంటీ లార్వా ఆపరేషన్ (దోమల మందు పిచికారి కార్యక్రమం) ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను పారద్రోల వచ్చునని దోమలు ప్రజారోగ్యానికి శత్రువులని దోమ తెరలు వాడాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు మలేరియా సబ్ యూనిట్ అధికారి బేగ్ మాట్లాడుతూ రెండు మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడే వ్యక్తులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలను గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గాని సంప్రదించాలన్నారు గ్రామ కార్యదర్శులతో పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మహమ్మద్ జానీ శేషగిరి సర్పంచ్ దండిపోయిన శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్త ఝాన్సీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దివ్య హెల్త్ అసిస్టెంట్ ఫ్రాంక్లిన్ సత్తనపల్లి మలేరియా యూనిట్ సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News