VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ము క్రోసూరు మండలం నందు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, స్కూల్స్, కాన్వెంట్స్, అంగనవాడి స్కూల్స్ నందు శుక్రవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 19 సంవత్సరముల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ డివిఎస్ రమాదేవి శుక్రవారం తెలిపారు క్రోసూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆమె మండల అధ్యక్షులు పెరుమాళ్ళ కోటయ్య తో కలిసి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వలన విద్యార్థులు ఆరోగ్యం మెరుగుపడుతుందని నులిపురుగుల నుండి విద్యార్థులు రక్షింపబడతారని తెలిపారు అనంతరం ఆమె చేతులు శుభ్రం చేసుకునే పద్ధతులు గూర్చి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అనంతవరం స్కూల్ను సందర్శించారు ఆయన మాట్లాడుతూ గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పుడు శుభ్రమైన నీటిని తాగాలని ఆహారాన్ని ఈగల వాడకుండా కప్పి ఉంచాలని కూరగాయలను పండ్లను శుభ్రమైన నీటితో కడగాలని బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకూడదని ఎప్పుడు మరుగుదొడ్లను ఉపయోగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సాంబశివరావు హెల్త్ సూపర్వైజర్లు శివుడు ప్రభావతి అమర జ్యోతి ఆరోగ్య కార్యకర్తలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News