VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పారుపల్లి గ్రామంలో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు అనిన సమాచారంతో సోమవారం పారుపల్లి గ్రామాన్ని క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ అంకమ్మ బాయ్ సందర్శించారు గ్రామంలో జరుగుతున్న దోమల నియంత్రణ చర్యలను ఆమె పరిశీలించారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు జ్వరాలతో సత్తనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పారుపల్లి గ్రామస్తులను ఆమె ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ తో కలిసి సందర్శించారు వివరాలను సేకరించారు. పారుపల్లి గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని గ్రామంలో డెంగ్యూ కేసులు ఏమి నమోదు కాలేదని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అంకం బాయ్ మాట్లాడుతూ ఇంటి మురికి కాలవల్లో చెత్తాచెదారం వేయకూడదని మురికి నీరు ఎప్పుడు పారే విధంగా చూడాలన్నారు ఇంటి పరిసరాలలో పనికిరాని డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు మొదలగు వాటిలో వర్షపు నీరు చేరి దోమలు ఉత్పత్తి జరుగుతుందన్నారు అలాంటి వాటిని తొలగించాలని పేర్కొన్నారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా విధిగా ప్రజలు అందరు కూడా డ్రైడే పాటించాలని అన్ని నీటి నిల్వలను పాత్రలను శుబ్రపరిచి తిరిగి నీరు నింపుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ మురికి నీరు నిల్వ ఉన్నచోట వారానికి ఒకసారి కిరోసిన్ ఆయిల్ గాని లేక వాహనాలు రిపేరు చేసిన వేస్ట్ ఆయిల్ గాని చల్లాలన్నారు ఎయిర్ కూలర్ లోని నీటిని వారానికి ఒకసారి మార్చాలన్నారు రెండు లేక మూడు రోజులకి మించి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను గాని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ను గాని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టీ వెంకటరమణ ఈఓఆర్డి శివరామయ్య అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వెంకటేశ్వరరావు మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ బేగ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్ శివుడు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జ్యోతి ఆరోగ్య కార్యకర్త రాజేశ్వరి ఆశా కార్యకర్తలు గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News