VM Today News - వార్తలు / పల్నాడు : పోలియో ఆదివారం జయప్రదముకై ప్రదర్శన మార్చి మూడో తేదీన ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదం చేయుటకై శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో విద్యార్థినీ విద్యార్థులచే ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీ జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి క్రోసూరు మెయిన్ బజార్ గుండా సాగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం, పోలియో చుక్కలు వేయడం పోలియో వ్యాధిని నిర్మూలిద్దాం, చేయి చేయి కలుపుదాం. పోలియో వ్యాధిని తరిమేద్దాం, ఆరోగ్యమే మహాభాగ్యం, నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో చుక్కలు మీ పిల్లలకు వేయించు అక్క అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పీకే వెంకటరమణ ఈ ఓ ఆర్ డి శివరామయ్య వైద్యాధికారి మహమ్మద్ సాద్ సి హెచ్ ఓ సాంబశివరావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్ శివుడు హై స్కూల్ ఉపాధ్యాయులు డి బాబురావు కె రామాంజనేయులు ఆర్ శ్రీధర్ ఆరోగ్య కార్యకర్త లావణ్య ఆశా కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News