VM Today News - వార్తలు / : ఇటీవల జారీ చేసిన దాదాపు 17,000 కొత్త క్రెడిట్ కార్డులు వివిధ డిజిటల్ పద్ధతుల్లో పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్ గురువారం ప్రకటించింది. అయినప్పటికీ ఈ తప్పు వల్ల ఎటువంటి దుర్వినియోగం జరుగలేదన్న బ్యాంక్.. ఒకవేళ ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే బాధిత కస్టమర్లకు దాన్ని పరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కాగా, కొత్త క్రెడిట్ కార్డులను వాడాలంటే కస్టమర్ల మొబైల్స్‌కు వచ్చే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు కీలకమని, కావున కార్డుల దుర్వినియోగం జరగడానికి చాలాచాలా తక్కువ వీలుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఈ కార్డులన్నింటినీ ఇప్పటికే బ్లాక్ చేశామంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ తప్పుగా పంపిణీ అయిన కార్డులను తిరిగి వెనక్కి తీసుకోవడం వీలు కానందున, అసలు కస్టమర్లకు త్వరలోనే కొత్త కార్డులు వస్తాయన్నది. అయితే బుధవారం సాయంత్రం నుంచే ఈ వ్యవహారం పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, దాన్నిప్పుడు బ్యాంక్ ధ్రువీకరించడం గమనార్హం. మరోవైపు ఈ తరహా నిర్లక్ష్యం మూలంగానే కొటక్ బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా ఝుళిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఐసీఐసీఐ హాట్ టాపికైంది.
Reporter
VMToday News