VM Today News - వార్తలు / పల్నాడు : జాతి నిర్మాణం, సమగ్రత, సామరస్యత, శాంతి పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్యాధికారిని సిరి చందన అన్నారు పల్నాడు జిల్లా కోసూరు మండలం దొడ్లేరు ఏపీ జి ఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా కోసూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఒక అమ్మగా జన్మనిస్తుందని, భార్యగా బాధ్యతలను మోస్తుందని, ఓ అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుందని, కూతురిగా ప్రేమను పొందుతుందని ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒక చోట తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు అన్నారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించిన సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళా సాధికారతయే జాతి సాధికారతని, కుటుంబానికి సమాజానికి, దేశాభివృద్ధికి మహిళల సేవ, త్యాగం, కృషి, అభినందనీయం అన్నారు మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో ప్రత్యేకంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, చంటి బిడ్డలను సంరక్షించుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్నారు క్రీడా పోటీల్లో గెలుపొందిన నారీమణులకు వైద్యాధికారిని సిరి చందన ఏపీజీఏ అధ్యక్షులు శిఖా శాంసన్ బహుమతులు అందజేశారు
Admin
VMToday News