VM Today News - వార్తలు / : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కాక ఎండల కంటే ఎక్కువగా ముదురుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉండడంతో రాజకీయం రంజుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఇప్పటివరకు జగన్ ఆయనను వ్యక్తిగతంగా కలవలేదు. తాజాగా షర్మిలను కాంగ్రెస్ లోకి పంపిందే టీడీపీ అధినేత చంద్రబాబు అని.. తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఆయన ఈ పని చేశారని జగన్ ఆరోపిస్తున్నారు. ఇలా తెలంగాణ సీఎం పేరును ఆయన ప్రస్తావిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ సరైన సమయంలోనే జగన్‌కు బదులిస్తారని తెలుస్తోంది.
Reporter
VMToday News