Monday, 09 December 2024 02:13:11 AM
# గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్

పల్స్ పోలియో కార్యక్రమం పై అవగాహన సదస్సు పోలియో రహిత దేశంగా భారత్ లక్ష్యంగా కృషి చేద్దాం: వైద్య అధికారిని డి వి ఎస్ రమాదేవి

Date : 29 February 2024 07:03 PM Views : 147

VM Today News - వార్తలు / పల్నాడు : పల్స్ పోలియో కార్యక్రమం పై అవగాహన సదస్సు పోలియో రహిత దేశంగా భారత్ లక్ష్యంగా కృషి చేద్దాం వైద్యాధికారిని డివిఎస్ రమాదేవి మార్చి మూడో తేదీన జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో వ్యాక్సినేటర్స్ కు ఆరోగ్య సిబ్బందికి శిక్షణా కార్యక్రమం గురువారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు జిల్లా పరిషత్ హై స్కూల్ సమావేశపు మందిరంలో జరిగినది ఈ కార్యక్రమమునకు వచ్చిన పోలియో వ్యాక్సినేటర్లకు ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ డివిఎస్ రమాదేవి శిక్షణ ఇచ్చారు పల్స్ పోలియో కార్యక్రమంలో వ్యాక్సినేటర్లు పాటించాల్సిన ముఖ్య విషయాలను ఆమె వివరించారు ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా క్రోసూరు మండల అధ్యక్షులు పెరుమాళ్ళ కోటయ్య పాల్గొన్నారు వైద్య సిబ్బంది ఐదు సంవత్సరంలో లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయటానికి తమ వంతు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా వైద్యాధికారిని రమాదేవి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన వయసు నుండి ఐదు సంవత్సరంల లోపు వయసు ఉన్న పిల్లలకు మార్చి మూడో తేదీన పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించాలని వారి తల్లిదండ్రులకు వైద్య సిబ్బంది కచ్చితంగా తెలియజేయాలని ఆమె పేర్కొన్నారు గ్రామాల్లో టాం టాం ద్వారా చర్చిలలో మసీదులలో దేవాలయాల్లో పల్స్ పోలియో గూర్చి సమాచారం చేరవేయాలని ఆమె కోరారు మొదటి రోజు మూడవ తేదీ ఆదివారం పల్స్ పోలియో బూత్ లలో పోలియో చుక్కలు వేయాలని తదుపరి రెండవ రోజు నాలుగో తేదీ సోమవారం మరియు మూడవరోజు ఐదో తేదీ మంగళవారం గృహాలను ఆశ వర్కర్లు కార్యకర్తలు సందర్శించడం ద్వారా ఎవరైనా మొదటి రోజు అనగా ఆదివారం చుక్కల వేయించుకొనని పిల్లలు ఉంటే వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయాలని తద్వారా 100% పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని తద్వారా భారతదేశం పోలియో రహిత దేశంగా ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఆమె తెలిపారు పిల్లలకు చుక్కలు వేశాక ఎడమ చేయి చిటికెన వేలికి మార్కింగ్ పెట్టవలెనన్నారు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బూతుల నందు చుక్కలు వేయాలని కోరారు మండల పరిధిలో 25 పల్స్ పోలియో బూత్ లు రెండు మొబైల్ టీములు ఒక ట్రాన్సిట్ టీము ముగ్గురు రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగింది డాక్టర్ రమాదేవి తెలిపారు ఈ సందర్భంగా మరోవైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ మాట్లాడుతూ సంచార జాతులు, ఇటుక బట్టీలు, కట్టడాలు నిర్మాణ స్థలాల్లో పనిచేసే వారికి వేరే ప్రాంతం నుండి క్రోసూరు మండలానికి మిరపకోతలకు వచ్చిన వ్యవసాయ కూలీల పిల్లలకు మొబైల్ టీం ద్వారా పోలియో చుక్కలు వేయటం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా మరోవైద్యాధికారి మహమ్మద్ సాద్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలి అని అన్నారు ప్రతి ఇంటిని ఓ పద్ధతి ప్రకారం సందర్శించాలి ఒక్క ఇంటిని కూడా వదిలి పెట్టకూడదు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ 7A,7B,8C,8B,8D,9A,9A HRA,9B,9B HRA ఫార్మేట్లను ఏ విధంగా పూర్తి చేయాలో విపులంగా వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు రమాదేవి అంకమ్మ బాయ్ మహమ్మద్ షాద్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివరావు, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, హెల్త్ సూపర్వైజర్లు శివుడు, ప్రభావతి, అమర జ్యోతి, మండలంలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆడ మగ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :