VM Today News - వార్తలు / : రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. దీనికి గాను 9 వేల డాలర్ల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి వాన్ మర్చెన్ తీర్పులో స్పష్టం చేశారు. మరోసారి ఉల్లంఘనకు పాల్పడితే జైలుకు పంపిస్తామని గట్టిగా హెచ్చరించారు.
Reporter
VMToday News