Monday, 09 December 2024 04:03:22 AM
# గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్

ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి

క్రోసూరు

Date : 03 April 2024 11:11 PM Views : 305

VM Today News - వార్తలు / పల్నాడు : ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ రోజురోజుకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కోరారు బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు ఒకటవ సచివాలయం ఆవరణలో వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ఎండ తీవ్రత వడగాల్పుల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు స్థానిక టీవీ చానల్స్ తో పాటు రేడియోలో వార్తలు వింటూ వార్తాపత్రికలు చదువుతూ ఎండ తీవ్రత గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎండ తీవ్రత పై అప్రమత్తంగా ఉంటూ మరిన్ని సూచనలు పాటించాలన్నారు ఎండలోకి వెళ్లేటప్పుడు నెత్తికి టోపీ పెట్టుకోవాలి లేదా రోమాలు కర్చీఫ్ కట్టుకొని తెల్లని కాటన్ వస్త్రాలు ధరించండి అదేవిధంగా కళ్ళకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి వీలైనంతవరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి దాహం వేయకపోయినా తరచుగా నీటిని త్రాగండి ఉప్పు కలిపిన మజ్జిగ గ్లూకోజు ఓఆర్ఎస్ కలిపిన నీటిని త్రాగండి వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన చికిత్స చేయించాలి ఎండలో నుండి వచ్చిన వెంటనే నీరు గాని నిమ్మకాయ రసం గానీ కొబ్బరి నీరు గాని త్రాగాలి తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తల తిరుగుట వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గర్లో వైద్యున్ని సంప్రదించాలి ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడని పనులు గూర్చి ఆయన వివరిస్తూ ఎండలో గొడుగు లేకుండా తిరగరాదన్నారు వేసవికాలంలో నలుపు రంగు మందంగా ఉండే దుస్తులు ధరించకూడదన్నారు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యకాలంలో బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు బాలింతలు చిన్నపిల్లలు వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు వడ దెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన ప్రధమ చికిత్స గూర్చి ఆయన వివరించారు వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి అన్నారు చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి ఎవరైనా వడదెబ్బకు గురైతే వారిని వెంటనే నీడలో పడుకోబెట్టి వారి దుస్తులు వదులు చేయాలి ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన ద్రావణం లేదా ఓరల్ రిహైడ్రేషన్ ద్రావణం తాగించాలి వీలైనంత త్వరగా దగ్గర్లో ఆసుపత్రికి తరలించాలి ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భూలక్ష్మి మాట్లాడుతూ శరీర ఉష్ణోగ్రత పెరగడం వణుకు పుట్టడం మగత నిద్ర లేదా కలవరింతలు ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం ఆరోగ్య కార్యకర్త అనుపమ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :