VM Today News - రాజకీయం / గుంటూరు : భారతీయ జనతా పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా ? డాక్టర్ ధారా అంబేద్కర్ పేరు అధిష్టాన పరిశీలనలో ఉన్నట్లు కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా హల్ చల్ చేస్తున్న సమాచారం.! డాక్టర్ దారా అంబేద్కర్ గతంలో గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జంతుశాస్త్రం విభాగంలో సహాయ ఆచార్యులుగా పని చేశారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని పునరుద్ధరించినప్పుడు గుంటూరు- కృష్ణాజిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎక్కువ శాతం విద్యావంతుల ఓట్లు బాపట్ల నుండి పొంది మూడో స్థానాన్ని సాధించారు. డాక్టర్ అంబేద్కర్ 2019 ఎన్నికలలో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం అందరికీ తెలిసిన విషయమే. మరి ఈసారి బాపట్ల పార్లమెంటు స్థానాన్ని ఎంచుకోవడంలో దారా వంశస్తుల పాత్ర మాజీ ఎమ్మెల్యే నుండి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మనోభావం. అంతేకాక బాపట్ల జిల్లాలోని సంతనూతలపాడు అసెంబ్లీ పరిధిలో తన సొంత గ్రామం మట్టిగుంట మరియు దగ్గర బంధువు అభ్యర్థి తండ్రి- సోదరుడు మాజీ ఎమ్మెల్యే అవటం చేత అక్కడ పోటీ బలీయంగా మరియు జిల్లా అంతట ధారా వర్గీయులు, బంధువులు దారా అంబేద్కర్ విజయానికి విశేష కృషి చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రస్ఫుటం అవుతున్నది. కావున అధిష్టానం యువకుడు విద్యావంతుడైన డాక్టర్ దారా అంబేద్కర్ కు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పిస్తుందని తమ సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని పార్టీ విజయానికి కృషి చేస్తామని ముఖ్య జిల్లా బిజెపి నాయకులు తెలియజేస్తున్నారని వినికిడి.?
Admin
VMToday News