VM Today News - వార్తలు / పల్నాడు : బాల్య వివాహాలను నిర్మూలించటం సమాజ బాధ్యత అని మాచర్ల సీనియర్ అడ్వకేట్ గెల్లెపోగు జయానందరావు అన్నారు పల్నాడు జిల్లాలో బాల్యవివాహాలు నిర్మూలనను కార్డ్స్ సంస్థ బాలబాట ఆవేర్నెస్ కార్యక్రమాలు ప్రజలను చైతన్య పరచడం నేటి అవసరం అని కార్డ్స్ సంస్థ శనివారం దుర్గి లో ఉపాధి హామీ మీటింగ్ హాల్ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు కార్యక్రమానికి దుర్గి బాలబాట ఏ సి ఓ కుక్కమూడి ప్రమీల అధ్యక్షత మాట్లాడారు కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లూరి అమర్నాథ్ హాజరై మాట్లాడుతూ నిరక్షరాస్యత మూఢనమ్మకాలు అభద్రత భావంతో కొంతమంది బాల్యవివాహాలు జరుగుతున్నాయని వాటిని విద్య ద్వారానే నిర్మూలించవచ్చని బాల్యవివాహాలు నిర్మూలన ఏ ఒక్క ప్రభుత్వ శాఖ బాధ్యత కాదని ఆయన అన్నారు
పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చట్ట ప్రకారం 2006 వ సంవత్సరంలో వచ్చిన చట్టం ఆడపిల్లలకు 18 సంవత్సరాలుమగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన వారికి పెండ్లి చేయాలని అలా కాకుండా పెండ్లి చేస్తే బాల్య వివాహాలు కిందకే వస్తాయని అది చట్టరీత్యా నేరమని ఆయన అన్నారు బాల్య వివాహాలపై కలిగే నష్టాలపై ఆయన అవగాహన కల్పించారు హ్యూమన్ రైట్స్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు ఏపీ భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యరసాని జక్రయ్య, ఎమ్మార్పీఎస్ మాచర్ల నియోజకవర్గం అధ్యక్షులు గేరా మల్లయ్య, కార్డ్స్ సంస్థ బాలబాట ఆర్ సి ఓ పేరుపోగు ప్రసాదరావు బాల్యవివాహాల నిర్మూలన పై మాట్లాడారు కార్యక్రమంలో సరస్వతి కోచింగ్ సెంటర్ మాచర్ల రాజు పాల్గొన్నారు కార్యక్రమం మొదటిలో బాలబాట డివోలతో బాలబాట ప్రతిజ్ఞ చేయించారు అనంతరం 30 మంది డివోలకు ప్రొవిజన్స్ పంపిణీ చేశారు
Admin
VMToday News