VM Today News - రాజకీయం / పల్నాడు : క్రోసూరు : ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సతీమణి లావణ్య. కార్యకర్తలను అభిమానులు తానే స్వయంగా వెళ్లి కలిసి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. లావణ్య వరాలమ్మ లావణ్య అంటూ ముసలి ముతక ప్రజలందరూ లావణ్య కు ఆయా గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గరికపాడు గ్రామంలో మరియు గుడిపాడు గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ సతీమణి లావణ్య రెండు గ్రామాల ప్రజలను ఇంటింటికి వెళ్లి ఆప్యాయతగా ప్రేమానురాగాలతో పలకరిస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ప్రవీణ్ గారిని గెలిపించినందుకు మీ అందరికీ ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామొ ఆ హామీలన్నీ అమలయ్యే బాధ్యత మా దంపతులు ఇరువురం తీసుకుంటామని, ప్రభుత్వం ద్వారా అందాల్సిన ప్రతి పథకాలు అన్నిటినీ అందించే బాధ్యత మాది అని ఆమె అన్నారు ఎమ్మెల్యే ప్రవీణ్ గారి ద్వారా మేమందరం నిరుపేదలకు నియోజకవర్గంలో వెనకబడిన ప్రతి వర్గాన్ని ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు రెండు గ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ,రెండు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
VMToday News