Saturday, 27 July 2024 03:38:15 PM
# వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి

యన్నాదేవిలో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి అంబటి

Date : 28 April 2024 12:17 PM Views : 88

VM Today News - రాజకీయం / పల్నాడు : సత్తెనపల్లి ప్రజల్లో విశ్వసనీయత, జనాదరణ కలిగిన ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి అని, ఏదైనా చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని యన్నాదేవి గ్రామములో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానికు మహిళలు వ్యతిరేకి హారతులు ఇచ్చారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు .ప్రచార రథంపై ఆయన వెంట అశేష జనం తరలిరాగా ప్రధాన వీధుల్లో పర్యటించారు. అనంతరం ముఖ్య నాయకులు , క్రియాశీలక కార్యకర్తల నివాసాలకు వెళ్లి చర్చించారు. మే నెల 13వ తేదీన ఎన్నికల నిర్వహణకు నాయకులను ఆయన సమయాయత్తం చేశారు. ప్రతి వ్యక్తి కీలకమైనవారెన్సీన్నారు. ఈ ఐదేళ్లలో వైయస్సార్సీపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు మనకు బ్రాండ్ అంబాసిడర్ లే అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మానిఫెస్టోపట్ల ప్రజల్లో మంచి స్పందన లభించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే నెరవేరుస్తాడని, మాట తప్పడని చర్చ జరుగుతోందన్నారు. గత ప్రజా ప్రయోజకరమైన పథకాన్నిటినీ కొనసాగిస్తూనే వాటిని విస్తరించడం, మెరుగుపరచడం శుభపరిణామన్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి అవసరమైన సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం అన్నారు. రానున్న ఎన్నికల్లో విశ్వసనీయతకు అండగా ఉండాలన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో నన్ను , పార్లమెంటు పరిధిలో అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించి మాకు తోడ్పాటు నివ్వాలన్నారు. ఈ సందర్భంగా అంబటికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన సంక్షేమం గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు , స్థానిక నాయకులు , ప్రజాప్రతినిధులు వైయస్సార్ సిపి అనుబంధ సంఘాల బాధ్యులు, పూర్వ వాలంటీర్లు తదితరులు ఉన్నారు


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :