Friday, 23 October 2026 03:20:04 AM
# నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయం: డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ # బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయం: డాక్టర్ కుక్కమూడి ప్రసాద్

Date : 28 September 2026 11:23 PM Views : 57

VM Today News - రాజకీయం / పల్నాడు : నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయమని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ అన్నారు. మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా సోమవారం మాచర్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి కుక్కమూడి ప్రసాద్ ఆధ్వర్యంలో దళిత ప్రజా సంఘాలతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను తన రచనలు, కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి గుర్రం జాషువా అని, సమాజంలోని అంటరానితనం , అస్వృశ్యత, కులవివక్షను నిర్మూలించడానికి తన యొక్క కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాకవి గుర్రం జాషువా అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పద్మభూషణ్ అనేకమైనటువంటి బిరుదులను ఇవ్వటం జరిగిందని తన రచనలు కవిత్వం ద్వారా ఈ సమాజాన్ని మేల్కొల్పినటువంటి వ్యక్తి గుర్రం జాషువా అని యువత ఆయన యొక్క రచనలను కవిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని ప్రసాద్ అన్నారు . శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు మాట్లాడుతూ గుర్రం జాషువా గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులర్పించటం గర్వంగా ఉందని ఇలాంటి మహాకవులను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని సమాజంలోనే అంటరానితనం నిర్మూలన కోసం కృషి చేయాలన్నారు. బీసీ నవ చైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి ఈశ్వరయ్య మాట్లాడుతూ గుర్రం జాషువా గారిని స్మరించుకోవడం సంతోషంగా ఉందని ఆయన యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఆయన అన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :