VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు విజ్ఞప్తి చేశారు.. శనివారం ఉదయం పల్నాడు జిల్లా నరసరావుపేట లోని కలెక్టరేట్ లో జరిగిన ఎస్సీ, ఎస్టీలు & దివ్యాంగుల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన బాధితులతో కలిసి పలు రకాల భూ సమస్యలపై జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ అద్దెయ్యకు అర్జీలు అందజేశారు. వారు సమస్యలపై సానుకూలంగా స్పందించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలియజేశారని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ తో పాటు విజయపురి సౌత్ నాగార్జునసాగర్ మరియు గుళ్లపల్లి భూ సమస్యల బాధితులు ఉన్నారు.
Admin
VMToday News