VM Today News - రాజకీయం / పల్నాడు : ఎన్నికల సందర్భంగా వైసిపి మూకలు చేసిన అరాచక దాడిలో గాయపడిన బాధితులను లావు శ్రీకృష్ణదేవరాయలు, జివి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, కొమ్మాలపాటి శ్రీధర్ , మక్కెన మల్లికార్జున పరామర్శించారు. -మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో గాయపడి,, నరసరావుపేట, వినుకొండ పట్టణాల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని నింపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పల్నాడు పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది, వైసిపికి తొత్తులుగా అన్నట్లు వారు పనిచేయడం బాధాకరం. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను.. వైసీపీ వారు ఓటమి భయంతో అరాచక దాడులకు దిగారని అన్నారు. విచక్షణ దాడులతో రక్త చరిత్రను సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమంగా సామాన్యుడు వారి కుటుంబాలు దెబ్బతిన్న పరిస్థితులు సృష్టించారని అన్నారు.
Reporter
VMToday News