Wednesday, 16 October 2024 08:43:08 AM
# గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్

మేలు చేసిన వారికే మళ్లీ పట్టం కట్టండి

Date : 06 May 2024 12:52 PM Views : 181

VM Today News - రాజకీయం / పల్నాడు : మేలు చేసిన వారికే మళ్లీ పట్టం కట్టండి. కుట్రల కూటమికి ఓటుతో బుద్ధి చెప్పండి గోళ్లపాడు, కుందురువారిపాలెం  గ్రామాలలో ప్రచారంలో మంత్రి అంబటి. ప్రచారంలో పాల్గొన్న నిమ్మకాయల, ఇతర ప్రజాప్రతినిధులు కుట్రల కూటమికి ఓటుతో బుద్ధి చెప్పాలని,ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ప్రతి ఇంటికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టం కట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు , నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని గోళ్లపాడు, కుందురువారిపాలెం గ్రామాల్లో గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోళ్లపాడు లో ముందుగా ఎస్టీ కాలనీ వద్ద స్థానిక మహిళలు భారీగా ఎదురేగి స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి ,శాలువా కప్పి సత్కరించి, విజయతిలకం దిద్దారు. అనంతరం కాలనీలో ప్రధాన వీధుల్లో ప్రచారంపై పర్యటించారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ, ఫ్యాను గుర్తుకే ఓటు వేయమని చెప్తూ ముందుకు సాగారు. గ్రామములో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన డీజే, తీన్మార్ల డప్పుల మేళాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కుందురువారి పాలెం గ్రామంలోనూ అంబటి కి అపూర్వ ఆదరణ లభించింది. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వేరు వేరు సమయాల్లో అంబటి మాట్లాడుతూ మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాకే జమ చేయడం ద్వారా రాష్ట్రంలో సరికొత్త సంక్షేమ విప్లవాన్ని జగనన్న తీసుకు వచ్చారన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రతి రూపాయి లబ్ధిదారులకే చేయడంతో పేద ప్రజల హృదయాల్లో జగనన్న సుస్థిర స్థాయిలో నిలిచిపోయారన్నారు. ఈ సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను గెలిపిద్దామని ఆయన కోరారు. ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో నియోజకవర్గంలో నన్ను ,పార్లమెంట్లో అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నక్క శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులున్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :