Monday, 02 March 2026 04:19:02 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

అంతిమ విజయం జగనన్నదే. గత మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా  నాది నైతిక పరాజయమే:  పునరుద్ఘాటించిన అంబటి పాత్రికేయుల సమావేశంలో మంత్రి అంబటి

Date : 25 April 2024 05:14 PM Views : 918

VM Today News - రాజకీయం / గుంటూరు : సత్తెనపల్లి : తరలివచ్చిన  ప్రజల ఆదరణను చూసి నాకు అపారమైన నమ్మకం ఉందని, అంతిమ విజయం జగనన్నదేనని, రాష్ట్రంలో 175 కి 175 సీట్లు గెలుస్తామని జలవనరుల శాఖామాత్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్సార్ సిపీ అభ్యర్థి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ 2014లో 926 ఓట్లతో ఓడిపోయానని, అనంతరం 2019 లో నియోజవర్గ ప్రజలు నాపై అభిమానంతో 20,876 ఓట్ల భారీ మెజార్టీతోగెలిపించా రన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో గత మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా నాది నైతిక పరాజయమేనని అంబటి మరోసారి పునరు ద్ఘాటించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐదు సంవత్సరాలుగా ధర్మం బద్దంగా నడుచుకు న్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టలేదని, వేధింపులు, కక్ష సాధింపులు లేని సుపరిపాలను అందించామన్నారు. అందుకే ఈ ఎన్నికలు  నా పరిపాలనకు రెఫరండం గా భావిస్తున్నానని స్పష్టం చేశారు. పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు , సంక్షేమ పథకాలు తీసుకుంటున్న అక్క ,చెల్లెమ్మలు అన్ని వర్గాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని భావిస్తున్నారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగనన్న మంచి మెజారిటీతో గెలుస్తారని, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల ఆదరణ చూసిన భరోసాతో పేర్కొంటున్నానన్నారు. నియోజకవర్గంలో కూడా ప్రజలు ప్రేమతో ఆదరించి ఫ్యాను గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. నామినేషన్ కార్యక్రమానికి నాలుగు మండలాలు, పట్టణం నుంచి వచ్చిన విశేష ప్రజానీకానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రితోపాటు పూర్వ శాసనసభ్యులు వెంకటేశ్వర రెడ్డి ,గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ , ఏఎంసీ చైర్మన్ పెండెం బాబురావు పూర్వ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ చిత్త విజయభాస్కర్ రెడ్డి పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్, ఇతర ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :