VM Today News - రాజకీయం / పల్నాడు : మునగోడు, తురగావారిపలెంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి జననీరాజనం అన్నా మీ పాలనలోనే మాకు మంచి జరిగింది. సంక్షేమ పథకాలతో మా బతుకులు బాగుపడ్డాయి.. మేమంతా మీ వెంటే.. అమరావతి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి జనం చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతి మండలం మునగోడు, తురగావారిపాలెం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి స్థానికులు నీరాజనం పలికారు. పూలతో స్వాగతం పలికి.. హారతులు పట్టారు. ఓట్లు వేయాలని ఎమ్మెల్యే అడగకముందే.. వారంతా.. తమకు జగనన్న పాలనలో మంచి జరిగిందని.. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని తెలిపారు. తమ జీవితాలు బాగుచేసిన జగనన్నకే తమ ఓటు అని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని.. 30 ఏళ్లలో జరగని అభివృద్ధి.. గత ఐదేళ్లో జరిగిందని తెలిపారు. అమరావతి - బెల్లంకొండ రోడ్డుతో పాటు.. రాజధానికి డబుల్ లేన్ రోడ్డు వేస్తున్నామన్నారు. పెదమద్దూరు బ్రిడ్జి కూడా పూర్తి చేస్తున్నామన్నారు. అమరావతిలో ఆస్పత్రులు బాగు చేశామని.. రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చామని చెప్పారు. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూస్తుంటే మళ్లీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేని ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకోవడం విశేషం. అన్నా మాకు మళ్లీ నువ్వే గెలవాలి.. ఎమ్మెల్యేగా రావాలి అంటూ యువకులు చెప్పడం జరిగింది.
Reporter
VMToday News