VM Today News - వార్తలు / పల్నాడు : వైభవోపేతంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం సత్తెనపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు సంఘ అధ్యక్షులు కోటగిరి పోతులూరయ్యాచారి కి సత్కారం సత్తెనపల్లి: స్థానిక పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఆరాధన మహోత్సవాలను సత్తెనపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పోతులూరయ్యాచారి మాట్లాడుతూ.. కాలజ్ఞాన రచయిత శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331వ ఆరాధన మహోత్సవం నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అని అన్నారు. అయితే పల్నాడు జిల్లాలో 144 సెషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకోలేకపోయామని అన్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు అధ్యక్షులు పోతులూరయ్యాచారిని చిరు సత్కారం గావించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి శ్రీనివాసచారి, మహంకాళి శ్రీనివాసరావు, అత్తలూరు కోటేశ్వరరావు, తిప్పర్తి శంకరరావు, దాసు భాస్కరాచారి, కోటగిరి గోపి,రంగు నాగభూషణాచారి, మహంకాళి భాస్కర్, యరోజు సత్యనారాయణ, సిద్దు ఆంజనేయులు, ఏలూరి శివా చారి,ఆంజనేయులు, గోపిక తిప్పర్తి మధులత, మహంకాళి పార్వతి, దాసు కల్పన, కోటగిరి చంద్ర కుమారి తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు....
Reporter
VMToday News