VM Today News - వార్తలు / ఎన్టీఆర్ : ఏ కొండూరు కేజీబీవీ వసతి గృహాన్ని పరిశీలించిన రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ పోతుల బాలకోటయ్య,ఏపీ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని) ఆదేశాల మేరకు స్థానిక నాయకులు,అధికారులతో కలిసి కేజీబీవీ పాఠశాలను పరిశీలించారు. ఎలుకలు కరిసిన 12 మంది విద్యార్థినిల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ పోతుల బాలకోటయ్య,ఏపీ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ విద్యార్థినులను ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పిస్తామని ఈ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాదల హరిచరణ్( కిట్టు),టిడిపి జిల్లా నాయకులు అలవాల రమేష్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు పీక్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు
Reporter
VMToday News