VM Today News - వార్తలు / పల్నాడు : సత్తెనపల్లి పట్టణ ఎస్సై సంధ్యారాణి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ సత్తెనపల్లి: స్థానిక సత్తెనపల్లి పట్టణంలో వెంగళరెడ్డి నగర్ 11వ వార్డ్ లో నివసిస్తున్న సౌపాటి దుర్గమ్మ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ ద్వారా ఒక నెలకు సరిపడ నిత్యావసర వస్తువులను పట్టణ ఎస్సై సంధ్యారాణి చేతుల మీదగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ నేషనల్ లీగల్ అడ్వైజర్ కోటగిరి లక్ష్మణ్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి గోపి, రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు అంచుల ఖాళీ దుర్గ, పల్నాడు జిల్లా అధ్యక్షుడు లంకెమల్ల రాంబాబు, షేక్ సైదా వలి, గర్నెపూడి చిన్న తదితరులు ఉన్నారు...
Reporter
VMToday News