VM Today News - వార్తలు / పల్నాడు : సత్తెనపల్లి: ఆశ్రమ విద్యాసంస్థలపై తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ వంశ పారం పర్య ధర్మకర్త మాఠాదిపతి అన్నారు. మంగళవారం ఆశ్రమంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ దాత బంధువుగా చెప్పుకొంటున్న కట్టమూరి విజయ వెంకట లక్ష్మి నరసింహారావు కొందరు వ్యక్తులకు ఆశ్రమ స్థలంలో కొంత భాగాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసాడని దానిని కొనుగోలు చేశామని చెపుతున్నవారు తాము నష్టపోయామని ఆశ్రమం నష్టపరిహారం భరించాలని పలు విధాలుగా ఆశ్రమ భాద్యులపై వత్తిడి తెస్తున్నారన్నారు. తాము పొందిన తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలను వేరే వారికీ అమ్మేప్రయత్నం చేస్తుండగా డాకుమెంట్స్ పై విచారణ జరిపిన ఒంగోలు జిల్లా రిజిస్టార్ తప్పుడు డాకుమెంట్స్ గా నిర్ధారిస్తూ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా అమ్మానబ్రోలు రిజిస్టార్ ని ఆదేశించారన్నారు. దీనిపై సబ్ రిజిస్టార్ పోలీస్ లకు ఫిర్యాదు చేసారన్నారు. రాజీకి రాకపోవటం తో ఆశ్రమం పై విద్యాసంస్థపై కొందరి చేత తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానిని తీవ్రంగా ఖండిస్తున్నమ్మన్నారు. విద్యాసంస్థలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ సైదా నాయక్ అన్నారు. విద్యాసంస్థలో అనేక పేద విద్యార్థులు చదుకొంటున్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నరన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పధకాలతో విద్య అందిస్తున్నమన్నారు. ఆశ్రమం ఆస్తుల విషయంలో విద్యాసంస్థపై తప్పుడు ప్రచారం చేయటం సాహెత కం కాదన్నారు. ఎటువంటి ఆక్రమణలు చేయవలసిన అవసరం ఆశ్రమానికి లేదని దాతలు ఇచ్చిన భూమిని కాపాడటంలో వస్తున్న వివాదాలు వలనే తప్పుడు ప్రచారం అని ఆశ్రమ భాద్యులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కన్నా సూచన మేరకు ఆశ్రమ ఆస్తులపై సర్వే కు ధరకాస్తు చేసామన్నారు. ఆశ్రమానికి దాతలు వ్రాసి ఇచ్చిన స్థలం ఎటువంటి అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నరన్నారు.సమావేశంలో ఆశ్రమం భాద్యులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.
Reporter
VMToday News