VM Today News - వార్తలు / అన్నమయ్య : కార్యకర్తలు, నాయకులు అవిశ్రాంతంగా పనిచేసి భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) సంస్థను బలోపేతం చేద్దామని ఆసంస్థ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం పీలేరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు భారతీయ అంబేడ్కర్ సేన ముఖ్య ప్రతినిధుల సమావేశం జరిగింది. బాస్ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శివప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే డిసెంబర్ 20 నుండి జనవరి 26 వరకూ భారతీయ అంబేడ్కర్ సేన 12వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పారు. బాస్ సంస్థను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 1నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 10వేలకు తగ్గకుండా సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో నాయకులు చూపే చొరవను బట్టి, తదుపరి జరుగబోయే నూతన కమిటీల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.ఫిబ్రవరి చివరి నాటికి సభ్యత్వ నమోదు, నూతన కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ పేదల సమస్యలపై ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, కావున నాయకులు - కార్యకర్తలు తమ పనులు వేగవంతం చేసి భవిష్యత్ పోరాటాలకు ప్రజల్ని సన్నద్ధం చేయాలని శివప్రసాద్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాస్ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు, ప్రజాకవి పోతబోలు రెడ్డెప్ప, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు బురుజు లక్ష్మీనారాయణ, ఆరుద్ర శ్రీనివాస్, సుధాకర్, గంగరాజు లతోపాటు బాస్ జిల్లా నాయకులు ముత్యాల మోహన్, నీరుగట్టి రమణ, ముల్లంగి కృష్ణయ్య, చాట్ల బయన్న, సొన్నికంటి రెడ్డెప్ప, బురుజు రెడ్డిప్రసాద్, సూరి రాయల్, జనార్దన్, ఇర్ఫాన్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
VMToday News