Saturday, 16 May 2026 04:21:00 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ..

ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు*

Date : 19 February 2026 12:08 PM Views : 134

VM Today News - వార్తలు / గుంటూరు : ప్రేమ, అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఓ భావోద్వేగ ఘటన. ఏకంగా 130 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో కన్నుమూసిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్‌కు చెందిన ఓ బ్రిటిష్ పౌరుడు నగరానికి రావడం విశేషం. ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాలను పరిశీలిస్తూ ఉండగా, తన ముత్తాత చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు. 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరిన చార్లెస్ విల్సన్ బెంగళూరు, మద్రాసు ప్రాంతాల్లో సేవలందించారు. అనంతరం సికింద్రాబాద్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేస్తూ 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 48 సంవత్సరాలు. తన పూర్వీకుడి సమాధి ఎక్కడుందో తెలుసుకోవాలని రాబిన్ గట్టిగా సంకల్పించారు. దాదాపు 19 ఏళ్ల పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగించారు. ఈ క్రమంలో స్థానిక జర్నలిస్ట్ రవిరెడ్డి సహకారంతో, ఎనిమిది నెలల క్రితం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ‘సెమెట్రీ-12’లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించగలిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాబిన్ తన భార్య లిన్‌తో కలిసి ఇంగ్లండ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముత్తాత సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి భావోద్వేగంతో నివాళులర్పించారు. “ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూశాను” అని రాబిన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక శతాబ్దానికి పైగా సాగిన అనుబంధం, 19 ఏళ్ల అన్వేషణతో సఫలమై ముగిసింది. కుటుంబ బంధాలకు, పూర్వీకులపై ఉన్న మమకారానికి ఇది అరుదైన ఉదాహరణగా నిలిచింది.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: